English | Telugu

హైదరాబాద్‌లో కరోనా రెడ్ జోన్!

రోనా బాధితులున్న ప్రాంతాలను 'కొవిడ్ - 19 క్వారంటైన్డ్ జోన్స‌గా తెలంగాణా ప్ర‌భుత్వం ప్రకటించింది. చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజాల్, కొత్త పేట ప్రాంతాలను రెడ్ జోన్ గా డిక్లేర్ చేసి ఈ ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలు విధించారు. ఇక్కడున్న వారు 14 రోజుల పాటు ఇళ్లల్లోని బయటకు రావొద్దని అధికారులు సూచించారు. రెడ్ జోన్‌లో వున్న‌వారంతా 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిందే.హెల్త్ కేర్ సిబ్బంది వీరి ఇళ్లకే వెళ్లి స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు. తద్వారా ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలుంటే ముందుగానే వారిని ఐసోలేషన్‌కు తరలించే అవకాశం ఉంటుంది.

వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతరత్రా వస్తువులు ఇంటి వద్దకే అధికారులు పంపించ‌నున్నారు. వీరికి మందులు, ఇతరత్రా అవసరాల కోసం ప్ర‌త్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. కిలో మీటర్ పరిధిలో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు చేసి..అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదని అధికారులు భావిస్తున్నారు. వైరస్ సోక‌కుండా అడ్డుకట్ట వేయాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్నారు. సామాజిక దూరం ఒక్కటే మనల్ని ఈ వైరస్ నుంచి కాపాడుతుంది.