English | Telugu
బలంగా మారిన కరోనా వైరస్! ఇంక్యుబేషన్ వ్యవధి 28 రోజులు!
Updated : May 6, 2020
కరోనా సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపించడానికి (ఇంక్యుబేషన్ వ్యవధి) 28 రోజుల వరకు పట్టవచ్చని ఉత్తరప్రదేశ్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో కరోనా లక్షణాలు 14 రోజుల్లో బయటపడటంలేదని సీనియర్ వైద్యుడు డాక్టర్ ఎస్‌కే కల్రా తెలిపారు. ఓ వ్యకిలో వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు పరీక్షలు జరిపితే 'నెగెటివ్'గా, ఆ తర్వాత వైరల్ లోడ్ పెరిగితే 'పాజిటివ్'గా వస్తుందని ఆగ్రా జిల్లా దవాఖాన చీఫ్ రెసిడెంట్ డాక్టర్ సతీశ్ వర్మ వివరించారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తులకు తరుచూ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
కరోనా వైరస్ రెండు రకాలుగా ఉన్నాయని తేల్చింది ఓ పరిశోధన.. కరోనా వైరస్‌పై పెకింగ్, షాంఘై వర్సిటీలకు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. కొవిడ్-19లో ఎల్, ఎస్ అనే రెండు జాతులు ఉన్నట్టుగా తేల్చారు. ఈ రెండు రకాల్లో 'ఎస్' రకం మొదటి నుంచీ ఉండగా.. జన్యు ఉత్పరివర్తనం కారణంగా 'ఎల్' రకం పుట్టుకొచ్చిందని ఆ అధ్యయనం తేల్చింది. ఇక మొదటి రకం ఎస్ కంటే 'ఎల్' మహా ప్రమాదకరమైన వైరస్ అని అంటున్నారు. అంతే కాదు ఇప్పటి వరకు ఎక్కువగా నమోదు అయిన కేసుల్లో 'ఎల్' ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొత్త కరోనా వైరస్‌పై ఏర్పడిన అదనపు ముళ్ల వల్ల అది మరింత తేలిగ్గా... ఊపిరి తిత్తుల్లో ఉన్న శ్వాస కణాల్లోకి వెళ్లగలుగుతోంది. ప్రస్తుతం కరోనాకి వ్యాక్సిన్ తయారుచేస్తున్న సంస్థలన్నీ... ఈ కొత్త వైరస్ రూపురేఖలు, సామర్ధ్యాన్ని వెంటనే గుర్తించి... అందుకు తగిన వ్యాక్సిన్ తయారుచెయ్యాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.