English | Telugu
ఆరోగ్య మంత్రి గారు క్వారంటైన్ నుంచి వచ్చేదెప్పుడు?
Updated : Mar 19, 2020
మంత్రిగారు ఇప్పట్టికే రాష్ట్రంలో రెండు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 102 మంది అనుమానితుల రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అయినా మీకు ఇవేమీ పట్టనట్లుంది. కనీసం పక్క రాష్ట్రం తెలంగాణా ను చూసైనా ఏలూరు నుంచి బయటికి రమ్మని ప్రజలు పిలుస్తున్నారు.
మిమ్మల్ని జగనన్న మంత్రి చేసింది కష్ట కాలంలో ప్రజలతో ఉంటారని, మీరేమో మీ నియోజకవర్గం దాటి రావడం లేదు. కనీసం మీరు ఆరోగ్యశాఖ మంత్రి అన్న విషయం గుర్తుందో లేదు అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. అమరావతికి వెళ్ళి కనిపించడం ఇష్టం లేకుంటే మీరు కోరుకున్నట్లు వైజాగ్ వెళ్ళినైనా సమీక్షలు చేస్తూ జనంకు ధైర్యం చెప్పండి సార్.
బుధవారంనాడు ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్షలో కూడా మీరు కనిపించలేదు. 15వ తేదీ అంటే ఐదు రోజు క్రితం సి.ఎం. సమీక్షలో మీరు కనిపించారు. అంతే. కరోనా భయంతో రాష్ట్ర ప్రజలు వుంటే మీరేమో రెండు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, ఒక సమీక్ష చేసి ఏలూరు వెళ్లిపోయారు.
కరోనా భయం జనంకు ఉండాలి కానీ మీకెందుకు సార్. ముఖ్యమంత్రి, అధికారులు అందరూ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబునాయుడు స్టైల్‌లో అధికారులే నమ్ముకున్నట్లుంది. అందుకే మీమ్మల్ని పట్టించుకోకుండా అలా ముందుకు వెళ్తున్నారు.
మీరేమో కనీసం వైద్య శాఖ మీద అవగాహన పెంచుకోలేదు. అయినా పర్వాలేదు. అధికారుల్ని అడిగి తెలుసుకోని ఆ తరువాతే మాట్లాడండి. మన ముఖ్యమంత్రి చెప్పిన సలహాను మీరు తూచ తప్పకుండా పాటిస్తున్నట్లు జనం ఘోరంగా చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రజల్ని కరోనా వైరస్ భయపెడుతుంటే మీరేమో సి.ఎం. చెప్పినట్లు పారాసిటమల్ వేసుకొని, బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని ఇంట్లో గురక పెట్టి నిద్దురపోతే ఎలా సార్.