తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు వెయ్యికి దగ్గరగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఈరోజు మళ్ళీ కేసులు పెరిగాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,637 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,143కు చేరుకుంది. ఇదిఇలా ఉండగా గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందినవారి సంఖ్య 1,357 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,100 యాక్టివ్ కేసులుండగా.. 2,24,686 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారిలో 15,335 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 136 కేసులు నిర్ధారణ అయ్యాయి.