English | Telugu

ఏపీలో కొత్తగా 7948 కరోనా కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 62,979 శాంపిల్స్ పరీక్షించగా 7948 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదేసమయంలో కరోనా కారణంగా 58 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,10,297 కి చేరగా.. మరణాల సంఖ్య 1148 కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 52,622 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 56,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి.