English | Telugu

కరోనాతో మృతి చెందిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య

కరోనా బారినపడి అనారోగ్యంతో నిమ్స్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78)మరణించారు. జులై 29న అనారోగ్యంతో ఆయన నిమ్స్ లో చేరారు. పదిరోజుల పాటు చికిత్స తీసుకున్నప్పటికీ ఆయన కోలుకోలేదు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

నంది ఎల్లయ్య ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథంను ఓడించి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.