English | Telugu
ఖుష్బూపై 50 పోలీస్ స్టేషన్లలో కేసులు!!
Updated : Oct 15, 2020
ఖుష్బూ వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు అన్నారు. కాంగ్రెస్ పై ఆమెకు ఏదైనా కోపం ఉంటే మరోలా విమర్శించుకోవాలని, మధ్యలో తమను కించపరిచే మాటలు ఎందుకు? అంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఖుష్బూ క్షమాపణలు చెప్పారు. అయితే, ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ, కొందరు ఆమెపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఖుష్బూ చెప్పిన క్షమాపణలను తాము అంగీకరించబోమని, ఆమె చట్టాన్ని ఉల్లంఘించారని, ఆమెపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు. దీంతో తొందరపాటు వ్యాఖ్యలు ఖుష్బూకి చిక్కులు తెచ్చి పెట్టాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.