కోవిద్ 19 వైరస్ ను అరికట్టడమే ప్రస్తుతం ప్రపంచమానవాళి ముందున్న అతి పెద్దసవాల్ గా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న వ్యాప్తిని నివారించడంతో పాటు కోవిద్ సోకినవారిలో అకస్మిక మరణాలను నివారించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు వైద్య పరిశోధకులు. ఈ నేపథ్యంలో కరోనా సోకినవారిలో రక్తం గడ్డకడ్డడం, రక్తనాళాల్లో వచ్చే వాపు కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించారు. దీన్ని నివారించేందుకు సాధారణ వ్యక్తుల్లో రక్తం గడ్డకట్టినప్పుడు రక్తనాళాల్లో రక్తప్రసారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా రక్తాన్ని పలుచగా చేసేందుకు ఇచ్చే ఔషధాన్ని కోవిద్ రోగులకు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటున్నాయి అని వైద్యలు అంటున్నారు. రక్తాన్ని పలుచన చేసే ఎల్ఎమ్ డబ్ల్యూహెచ్(లో మాలిక్యూలర్ వెయిట్ హెపారిన్) మందును కరోనా రోగులకు ఇస్తున్నారు. ఇది అకస్మిక మరణాలను నివారిస్తోందని గుర్తించారు. చర్మం కిందిపొరలకు ఇచ్చే ఇంజెక్షన్ ద్వారా ఈ మందుకు రోగి శరీరంలోకి పంపిస్తారు. ఇప్పటివరకు కోవిద్ వైరస్ సోకిన వారిలో దాదాపు 90శాతం అసక్మిక మరణాలను ఈ మందు నివారించిందని వైద్యలు వెల్లడించారు.
ఊపిరితిత్తులపై ప్రభావం చూసే కోవిద్ వైరస్ రక్తనాళాల్లో వాపు, రక్తం గడ్డకట్టడం వంటి ప్రమాదాలకు కూడా కారణం అవుతోంది. దాంతో కరోనా రోగుల్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని నివారించడానికి కరోనా రోగులకు చికిత్సలో భాగంగా ప్రొఫైలాక్టిక్ థెరపీలో దేశవ్యాప్తంగా ఎల్ఎమ్ డబ్ల్యూహెచ్ మందును ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధం ఉపయోగించడం వల్ల రికవరీ రేటు ఎక్కువగా ఉంటుందని వైద్యలు అంటున్నారు. కరోనా వచ్చిందని భయపడకుండా చికిత్స చేయించుకుంటే చాలావరకు నయం అవుతుంది.