English | Telugu

పల్లె ప్రగతి పై సీఎం సంచలన నిర్ణయం...

పల్లె ప్రగతి పై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పని తీరును పరిశీలించేందుకు జనవరి ఒకటి నుంచి గ్రామాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని రంగంలోకి దించుతున్నట్లు సీఎం తెలిపారు. కార్యక్రమాల పురోగతి నాణ్యతను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజాదరణ పొందిందన్నారు కేసీఆర్. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమం గతంలో 30 రోజుల పాటు జరిగింది. ప్రతీ పల్లెలో అక్కడున్న లోకల్ సమస్యల పరిష్కారం కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు.

ఈ నేపధ్యంలో పూర్తి స్థాయిలో విజయవంతమైందని దీంతో పాటు మరోక పది రోజుల పాటు పల్లెప్రగతి నిర్వహించాలని, ఇప్పటి వరకు ఏదైతే 30 రోజులలో నిర్వహించిన కోణంలో పెండింగ్ లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మరొక 10 రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావించినట్లు సమాచారం. దాంతోపాటు అధికారులపై గతంలో జరిగినటువంటి సమస్యల పై చాలా ఆగ్రహం వ్యక్తంచేశారు. పల్లె ప్రగతిలో ప్రజలు చాలా చురుగ్గా పాల్గొనడమే కాక ప్రజా ప్రతినిధులు కూడా చాలా ఆశక్తి చూపించారు. కానీ అధికారులు మాత్రం సమస్యలను నమోదు చేసుకుని, అక్కడ పరీష్కారం కాని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే విషయంలో విఫలమయ్యారంటూ ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఈ సారి జరిగేటువంటి పల్లె ప్రగతి పని తీరుని జనవరి ఒకటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ లను ఏర్పాటు చేశారు. ప్రతి పల్లెలో వాళ్ళు పర్యటిస్తారు. ఈ సారి ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకునెలా కేసీఆర్ తగిన చర్యలు తీసుకుంటున్నారు.