English | Telugu
భయపెడుతున్న కరోనా సెకండ్ వేవ్... అప్రమత్తమైన తెలంగాణ సర్కార్
Updated : Nov 23, 2020
అన్ని ఆసుపత్రుల్లో కలిపి అదనంగా మరో 5 వేల పడకలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా తొలి దశలో ఎదుర్కొన్న సంక్షోభ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, మరోసారి ఆ పరిస్థితి ఏర్పడకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి గాంధీ ఆసుపత్రి వరకూ కరోనా చికిత్సలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలనూ సిద్ధంగా ఉంచాలని, అదే విధంగా వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.