English | Telugu

రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు!

మీ ధాన్యం ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తోంది. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చెల్లిస్తాం. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. మీ గ్రామానికే వ‌చ్చి పంట కొంటారు. మీరు మార్కెట్‌కు రావ‌ద్దు. వ్య‌వ‌శాయ‌శాఖ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశాం. ల‌క్ష‌ల మంది రైతులకు అండ‌గా వుంటాం. నిదానంగా లైన్‌లో నిల‌బ‌డి పంట అమ్ముకోండి మీ ఊరిలోనే.
గ్రామాల్లో కంచె వేసుకోవ‌డం మంచిదే కానీ మీ ఊరి అవ‌స‌రాల‌కోసం అడ్డు తొల‌గించండి. మీ గ్రామ వ‌స‌తుల కోసం తెలివిగా వ్య‌వ‌హ‌రించండి.

రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా వుంది. మ‌న చేతిలో వున్న ఏకైక ఆయుధం వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకోవ‌డ‌మే. బ‌య‌టికి క‌ద‌ల‌కుండా ఇళ్ల‌కే ప‌రిమితం అవ్వాలి. మ‌న ఐక్య‌మ‌త్యంతో వ్యాధి వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి. రైతులు కూడా సంయ‌మ‌నం పాటించాల‌ని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

అంత‌ర్జాతీయంగా కొత్త కేసులు రావు. కాబ‌ట్టి పెద్ద ప్ర‌మాదం లేదు. రాష్ట్రంలో వున్న కేసుల్ని నియంత్రించుకోవాలి. కొంత మంది మూర్ఖంగా ప్ర‌వ‌ర్తించ‌డం వ‌ల్లే క‌రోనా విస్త‌రిస్తోంద‌ని సి.ఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌భుత్వ ఆధీనంలో ఐదు ల్యాబ్‌లు వ‌ర్కింగ్‌లో వున్నాయి. మ‌రొక‌టి అందుబాటులో రానుంది. అవ‌స‌ర‌మైతే సిసిఎంబి సిద్ధంగా వుంది. ప్ర‌భుత్వ కెపాసిటీ అయిన త‌రువాతే ప్రైవేట్ ల్యాబ్ ల‌ సంగ‌తి ఆలోచిస్తాం.