English | Telugu
ఇతర రాష్ట్రాల వారిని స్వంతబిడ్డల్లా కడుపులో పెట్టుకుంటాం!
Updated : Mar 27, 2020
లాక్డౌన్ను ఏప్రిల్ 15వరకు తెలంగాణాలో పెంచుతున్నాం, రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని సి.ఎం. చెప్పారు. కూరగాయలు బ్లాక్ మార్కెట్ కాకుండా స్థానిక నేతలు చూడండి. అయితే గుంపులు గుంపులుగా తిరగకండని నేతలకు కేసీఆర్ సలహా ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆకలికి గురికారాదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటాం. కాబట్టి మీరు ఎక్కడి వారు అక్కడే వుండండి. తరలి వెళ్లడానికి ప్రయత్నించకండి. మీకు జీతాలు ఇవ్వడమే కాదు అన్నం పెట్టి ఆదుకుంటామని సి.ఎం. హామీ ఇచ్చారు. ఈ విషయమై అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు సి.ఎం. తెలిపారు.
హైదరాబాద్ జిహెచ్ఎంసితో పాటు చుట్టుపక్కల వున్న 9 కార్పొరేషన్లో వున్న కార్మికుల్ని ఆదుకుంటాం. అధికారుల సమన్వయంతో సమస్యను అధికమిస్తాం.
పశుగ్రాశంకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నాం. పాలు, కూరగాయలు, పండ్ల వాహనాలకు ఇబ్బందిలేకుండా తిరిగేలా చర్యలు తీసుకున్నాం. డైరీ ఫాంలకు అవసరమైన గడ్డి తెప్పించుకోవచ్చు. ఎలాంటి ఆటంకం లేకుండా ఆదేశాలు జారీ చేశాం.
రోగనిరోధక శక్తిని పెంచుకోమని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కోడిగుడ్లు బాగా తినండి. అలాగే సి.విటమిన్ బాగా ఉపయోగపడుతుంది. బత్తాయిపండ్లను, మామిడిపండ్లను ఇతర ప్రాంతాలకు పంపకుండా మొత్తం తెలంగాణాలోనే సరఫరా చేయించండని సి.ఎం. ఆదేశించారు.