English | Telugu
పూర్తిగా అంతం చేయలేం.. వ్యాక్సిన్ వేసుకున్నా మూడు నెలలే...
Updated : Jul 14, 2020
వ్యాక్సిన్ వేసుకున్నా మూడునెలలే...
కోవిద్ 19 వైరస్ వ్యాక్సిన్ అతిత్వరలో అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం చాలామందిలో కనిపిస్తుంది. వ్యాక్సిన్ తీసుకుంటే చాలు కరోనా తమను ఎం చేయలేదు అన్న భద్రత ఉంటుంది అనుకుంటే అది పొరబాటే అంటున్నారు లండన్ పరిశోధకులు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మూడునెలలు మాత్రమే వైరస్ ను ఎదుర్కోనే శక్తి ఉంటది అంటున్నారు ఎన్‌హెచ్‌ఎస్, కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు.అంతేకాదు ఒక డోస్ వేసుకుంటే సరిపోదని, ప్రతి ఏడాది వేసుకోవాల్సిందే అంటున్నారు. అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కారణం ఈ వైరస్ ను పూర్తిగా అంతం చేయలేం. జబులు, దగ్గు మాదిరిగానే ప్రతి ఏడాది రావచ్చు. అయితే వ్యాక్సిన్ ల కోసం ఎదురుచూడటం కన్నా వ్యాప్తిని నియంత్రించడమే చాలా మంచిది.