English | Telugu

కేంద్రం మరో సంచలన నిర్ణయం!!

1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి వలస వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన 5,300 కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పరిహారాన్ని ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద అందజేయనున్నారు.

తాజాగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పీవోకే నుంచి వలస వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన 5,300 కుటుంబాలకు రూ.5.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నిరాశ్రయులైన కుటుంబాలకు ఈ నిర్ణయంతో న్యాయం జరుగుతుంది.’’ అని పేర్కొన్నారు.