English | Telugu

వియ్యంకులే లేచిపోయారు!

అదే పెళ్లి కుమార్తె తల్లిని పెళ్లికొడుకు తండ్రి లేపుకెళ్ళాడు. గుజరాత్ లో చోటు చేసుకున్నఈ ఉదంతం సోషల్ మీడియా వైరల్గా మారింది.

వరుడి తండ్రిపై వధువు తల్లి మ‌న‌సు ప‌డింది. అంతే ఇద్ద‌రి మ‌న‌స్సులు క‌లిశాయి. మాటాలు పెరిగాయి. ఇరువురు ఒక‌రి విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని ప‌రిస్థితికి వెళ్ళిపోయారు. పిల్లల పెళ్లికి కాస్త ముందుగా తామే లేచి పోయి వేరే కాపురం పెట్టి క‌లిసి వుంటున్నారు.

గుజ‌రాత్ రాష్ట్రం సూరత్ కు చెందిన 46 ఏళ్ల హిమ్మత్ పాండవ్, నవ్ సారీకి చెందిన శోభనా లేచిపోయిడంతో వారిద్దరి పిల్లల పెళ్లి నిలిచి పోయింది. దీంతో కుటుంబంలోని పెద్ద‌లు జోక్యం చేసుకొని లేచిపోయిన‌ కాబోయే వియ్యంకుల‌పై మిస్సింగ్ కేసు పెట్టి ఒత్తిడి చేయ‌డంతో ఆ జంట తిరిగి వచ్చింది.

అయితే పెళ్లి కుమార్తె తల్లి భ‌ర్త ఈ సంఘ‌ట‌న‌తో షాక్‌కు గురై ఆమెతో తెగ‌తెంపులు చేసుకోవ‌డంతో ఆమె తన తల్లిదండ్రుల వ‌ద్ద‌కు చేరింది. అయితే కొత్త ప్రేమికుడ్ని మ‌రిచిపోలేక మ‌రోసారి పారిపోయి హిమ్మ‌త్ పాండ‌వ్‌తో క‌లిసి వుంటోంద‌ట‌!