English | Telugu
హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో నో కామ్రేడ్స్...
Updated : Oct 2, 2019
హుజూర్ నగర్ ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లు 76, దాంట్లో 45 తిరస్కరణకు గురి కాగా బరిలో 31 మంది ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నేటివరకూ గడువు ఉంది. ఈ నెల 21 న పోలింగ్ జరగనుంది కాగా ఫలితాలు ఈ నెల 24 న వెలువడనున్నాయి.
హుజూర్ నగర్ లో సీపీఐ కు మంచి పట్టుంది కానీ, ఎన్నికల బరిలో నుంచి సిపీఐ తప్పుకుంది, సీపీఐ అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాగా ఎన్నికల ప్రచారానికి మద్దతుగా కాంగ్రెస్ ని కాదని టీ.ఆర్.ఎస్ వైపు మొగ్గు చూపింది. టీ.ఆర్.ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి తరపున సీపీఐ ప్రచారం చేయనుంది. ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ను సీ.పి.ఐ తిరస్కరించి టి.ఆర్.ఎస్ తో దోస్తీ ఎందుకు చేసిందో తెలియాల్సి ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని నారాయణ పేర్కొన్నారు.
అయితే పట్టున్న జిల్లాలలో సిపీఐ పోటీ చేయలేకపోవటం దురదృష్టకరంగా భావిస్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో తెలుగుదేశం, బిజెపి, టీ.అర్.ఎస్ తదితర పార్టీలు ఉన్నాయి. అయితే హుజూర్ నగర్లో ఎవరి జెండా ఎగరనుందో ఈ నెల 24 న తెలియనుంది. ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సిధ్ధమయ్యాయి, గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహ రచనలు చేస్తున్నారు.