English | Telugu

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ దూకుడు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా లెక్కిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ దూసుకుపోయింది. మెజార్టీ డివిజన్లలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ అభ్యర్థులకులీడ్ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లోని మొత్తం 150 డివిజన్ల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తైంది. 82 డివిజన్లలో కమలానికే ఎక్కువ వచ్చాయి. 31 డివిజన్లలో టీఆర్ఎస్, 16 డివిజన్లలో ఎంఐఎం, నాలుగు డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. 17 డివిజన్లలో ఏ పార్టీ అభ్యర్థికి పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ రాలేదు. అయితే పోల్టల్ బ్యాలెట్ లీడ్లు మెజార్టీ డివిజన్లలో ఒకటి, రెండు ఓట్ల వరకే ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చెల్లని ఓట్లు భారీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.