English | Telugu

బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది! గ్రేటర్ ఫలితాలపై కంగనా ట్వీట్

జీహెచ్ఎంసీ ఎన్నికల తొలి ఫలితాలపై హీరోయిన్ కంగన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోందని ఆమె ట్వీట్ చేసింది. జీహెచ్ఎంసీ ఫలితాలపై ఒకరు చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఆమె పలు వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపులో మొదటి కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉండడం పట్ల హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించింది.

‘ప్రియమైన కాంగ్రెస్ పార్టీ... మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.. రోజంతా కంగనా కంగనా అంటూ నా నామ జపం చేస్తున్నాయి.. ఇలాగైతే మీకు ఏ లాభం ఉండదు. క్లిష్టమైన నగరాల్లో బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది’ అని కంగనా రనౌత్ ట్వీట్ లో పేర్కొన్నారు.