English | Telugu
హరీష్‌రావును బలిపశువు చేశారు!
Updated : Nov 13, 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని జితేందర్ రెడ్డి తెలిపారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా 84 వేల మంది ప్రజలు నిలబడ్డారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తామని చెప్పారు జితేందర్ రెడ్డి. అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్నారు. విజయశాంతి బీజేపీలో ఎప్పుడు చేరబోతున్నారనే సమాచారం తన వద్ద లేదని చెప్పారు. వరదల సమయంలో ముంపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని జితేందర్ రెడ్డి విమర్శించారు. ఆ ప్రభావం అధికార పార్టీపై భారీగా ఉండబోతుందని చెప్పారు.