English | Telugu

జైలు గది, బాత్రూముల్లో కెమెరాలు: నవాజ్ షరీఫ్ కుమార్తె సంచలనం 

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్ పార్టీ ఉపాధ్యక్షురాలైన మర్యం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. తన జైలు గదితో పాటు, బాత్రూమ్ లో కూడా అధికారులు కెమెరాలను పెట్టారని చెప్పారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో గత ఏడాది ఆమె జైలుకు వెళ్లారు. అప్పుడు జైల్లో తాను అనుభవించిన ఇబ్బందుల గురించి జియో న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మర్యం నవాజ్ వివరించారు.

తాను రెండు సార్లు జైలుకు వెళ్లానని చెప్పారు మర్యం నవాజ్. ఒక మహిళనైన తన పట్ల వ్యవహరించిన తీరును చెపితే... ఈ ప్రభుత్వం ఎవరికీ మొహాన్ని కూడా చూపించలేదని ప్రశ్నించారు. తనను ఉంచిన సెల్ తో పాటు, బాత్రూమ్ లో కూడా కెమెరాలను ఉంచి తనను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ప్రపంచంలో ఏ మహిళ కూడా బలహీనురాలు కాదన్నారు మర్యం నవాజ్. రాజ్యాంగ వ్యవస్థలకు తాము వ్యతిరేకం కాదని.. రాజ్యాంగానికి లోబడి మిలిటరీ వ్యవస్థతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని తెలిపారు. అయితే తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తేనే తాము చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు నవాజ్ షరీఫ్ కుమార్తె.