English | Telugu

సెంచరీకి చేరువలో రాహుల్ గాంధీ ఓటములు...బీజేపీ సైటర్లు

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై బీజేపీ సైటైర్లు సంధించింది. ఎక్కడ ఎన్నికలు జరిగిన ఓటములకు చిహ్నంగా రాహుల్ గాంధీ మారారని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ విమర్శించారు. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ 95 సార్లు ఓడిపోయారని తెలిపారు. 2004 నుంచి 2025 వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన మ్యాప్‌ను కూడా మాలవీయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మరో ఎన్నిక, మరో ఓటమి ఎలక్షన్ ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే మొత్తం రాహుల్‌కే వస్తాయి అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దుందుభి మోగించింది. ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ (122)ను దాటేసి, 192 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు మహాగఠ్‌ బంధన్‌ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 84 జేడీయూ 78 ఎల్‌జేపీ 20 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో ప్రధాన పార్టీ ఆర్జేడీ 32 సీట్లలో ముందంజలో ఉండగా కాంగ్రెస్‌ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బిహార్‌లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.