English | Telugu
విశృంఖల శృంగారానికి తెర దించిన ఐరోపా సెక్స్ క్యాపిటల్
Updated : Mar 24, 2020
* ' వైఫ్ స్వాపింగ్ ' కు స్వస్తి చెప్పాలని దేశ ప్రజలకు బెల్జియం ఆరోగ్య మంత్రి డే బ్లాక్ విజ్ఞప్తి
* కరోనా దెబ్బకు, విచ్చలవిడి శృగారం వద్దని బెల్జియం ప్రకటన
* ముగ్గురు కి మించి పాల్గొనే విచ్చలవిడి మదన కేళికి ' షార్ట్ బ్రేక్ ' ప్రకటించాలని పార్లమెంట్ సాక్షిగా విన్నపం
* మానవ-జంతు శృంగారానికి మాత్రం మినహాయింపు నిచ్చిన బెల్జియం
* కింగ్ లియోపోల్డ్-II అలవాటు చేసిన వికృత సంస్కృతి తో బెల్జియం దేశానికి చెడ్డపేరు
* 16 వ శతాబ్దం లో ఆంధ్ర ప్రాంతం లో చెలరేగిన ఈ విష సంస్కృతికి చరమ గీతం పాడిన ఆంధ్ర పాలకుడు
బెల్జియం ప్రభుత్వం ఒక కఠోర నిర్ణయాన్ని ప్రకటించింది. విచ్చలవిడి , విశృంఖల శృంగారానికి తెర దించాల్సిందిగా ఆ దేశ పౌరులకు పార్లమెంట్ సాక్షిగా విజ్ఞప్తి చేసింది. భార్యల మార్పిడి ని తమ దేశ సంస్కృతిలో భాగంగా భావించే బెల్జియం దేశానికి యూరోప్ సెక్స్ క్యాపిటల్ అని కూడా పేరుంది. అంతే కాదు బెల్జియం అంటే బీర్బలుల దేశం గా ( అంటే బీరు ను అమితంగా సేవించే ప్రజలున్న దేశంగా ) మిగతా ప్రపంచం అంతా కూడా బెల్జియం ను పిలుస్తుందనే విషయం చాలా మందికి తెలుసు. సరే, ఇదేదో బయట దేశాల వారు అనుకుంటే లేదా గొణుక్కుంటె, అదేదో తేలిగ్గా తీసేయచ్చులే అనుకునే వారికి కళ్ళు బైర్లు కమ్మేలా, ఆ దేశ ఆరోగ్య శాఖా మంత్రి డే బ్లాక్ ఏకంగా పార్లమెంట్ లోనే ప్రకటించిందంటే, ఆ దేశం లో విశృంఖల శృంగారానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో వేరే చెప్పక్కర్లేదు.
తమ తమ ఇళ్లల్లో ఇద్దరికి మించి ఎవరూ శృంగారం లో పాల్గొనవద్దని, కోవిడ్ -19 వైరస్ పై పోరాటం లో భాగంగా 'సామాజిక దూరం' పాటించాలని, అందువల్ల ముగ్గురు లేదా అంతకు మించిన వారు పాల్గొనే 'నాన్ ఎసెన్షియల్ సెక్సువల్' కార్యకలాపాలను బెల్జియం లో నిషేధిస్తున్నామని మహిళ కూడా అయినా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డే బ్లాక్ ఏకంగా పార్లమెంట్ లోనే ప్రకటించింది. బెల్జియం దేశానికి బాహ్య ప్రపంచం లో ' బీర్ డ్రింకిన్గ్, ఇంకా " ఐరోపా సెక్స్ క్యాపిటల్" అని ఉన్న చెడ్డ పేరు దృష్ట్యా, అనివార్యంగా తానూ పార్లమెంట్ లో ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని ఆరోగ్య మంత్రి డే బ్లాక్ స్పష్టం చేశారు. భార్యల మార్పిడి, అలాగే ముగ్గురుకి మించి పాల్గొనే విశృంఖల శృంగార కార్యకలాపాలు , బెల్జియం దేశం లో కోవిడ్ -19 అదుపులోకి వచ్చేంతవరకూ నిషేధిస్తున్నట్టు ఆమె పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. అయితే, ఒకరు లేదా ఇద్దరి మధ్య సాగే విచ్చలవిడి శృంగార కార్యకలాపాలను, అంటే -హస్త ప్రయోగం, యానల్ సెక్స్, ఓరల్ సెక్స్ , ఇంకా మానవ-జంతు శృంగార (బెస్టాలిటీ) కార్యకలాపాలను మాత్రం బెల్జియం ఆరోగ్య మంత్రి నిషేధించలేదు. ఇప్పుడు ప్రకటించిన శృంగార నిషేధాజ్ఞలు మానవ శృంగారానికి పరిమితమని, మానవ-జంతు శృంగార కార్యకలాపాలకు ఇవి వర్తించవని ఆమె ప్రకటించటం తో మీడియా ప్రతినిధులు నిర్ఘాంత పోయారు.
2018 లో జరిగిన ఒక సర్వే ప్రకారం- బెల్జియం లోని 78 శాతం దంపతులు ' భార్యల మార్పిడి ' శృంగారాన్ని బహిరంగంగానే ప్రాక్టీస్ చేస్తారని వెల్లడైంది. 19 వ శతాబ్దం లో బెల్జియం ను పాలించిన కింగ్ లియోపోల్డ్-II ఈ తరహా వికృత శృంగార క్రీడ ను తమ దేశ సంస్కృతి లో ఒక భాగం గా మార్చేసినట్టు చారిత్రిక ఆధారాలున్నాయి. 74 ఏళ్ల వయసులో మరణించేంత వరకూ కూడా కింగ్ లియో పోలండ్-II ఈ 'వైఫ్ స్వాపింగ్ ' కు, తమ సంస్కృతిలో భాగంగా విస్తృత ప్రచారం కల్పించినట్టు చరిత్ర కారులు చాలా చోట్ల ప్రస్తావించారు.
అయితే, ఈ తరహా వికృత , విశృంఖల స్వేచ్ఛా శృంగార మదన కేళి 16 వ శతాబ్దం నుంచి ఆంధ్ర ప్రాంతం లోని కృష్ణా, గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో ' కంచుకోత్సవం ' పేరిట రాజ ప్రాసాదాలు ప్రోత్సహించిన సందర్భాల గురించి పలు చారిత్రిక గ్రంధాల్లో అంతర్లీన ప్రస్తావన ఉంది. అయితే, ఆ విచ్చలవిడి క్రీడకు చరమ గీతం పాడిన సంస్కరణల రూపకర్త అయిన , ఒక ఆంధ్ర పాలకుడి గురించి 'తెలుగు వన్ ' ప్రత్యేక కథనం త్వరలో మీ కోసం..