English | Telugu
పోలింగ్ శాతం తగ్గేలా టీఆర్‌ఎస్ కుట్ర.!
Updated : Dec 1, 2020
కేసీఆర్, మంత్రులు తప్పుడు ప్రకటనలతో ప్రజలను భయపెట్టారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మతాన్ని బూచీగా చూపి తప్పుడు ప్రచారం చేశారు. మతకలహాలు జరుగుతాయంటూ ప్రజలను భయపెట్టారని అన్నారు. అనుకూలమైన ఉద్యోగులకే ఎన్నికల డ్యూటీ వేశారని ఆరోపించారు. అడ్డదారి, అక్రమ పద్ధతిలో గెలిచే ప్రయత్నం చేశారని, ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని అన్నారు. బీజేపీ మేయర్ గెలవబోతోంది అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.