English | Telugu
దత్తాత్రేయ కారుకు ప్రమాదం! తప్పిన పెను గండం
Updated : Dec 14, 2020
కారు ఎడమ వైపును దూసుకువెళ్లడంతో అంతా బయపడ్జారు. డ్రైవర్ కారును సేఫ్ గా ఆపేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడ లేదు. ఘటనాస్థిలికి చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు.. దత్తాత్రేయను మరో కారులో నల్గొండకు పంపించారు .నల్లగొండలో తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమం లో పాల్గొనేందుకు వెళుతుండగా దత్తాత్రేయ కారుకు ఈ ప్రమాదం జరిగింది.
బండారు దత్తాత్రేయ వాహనం ప్రమాదానికి గురైందన్న సమాచారంతో రాష్ట్ర బీజేపీ నేతలు, ఆయన అభిమానులు కలవరానికి గురయ్యారు. అయితే ప్రమాదం ఏమి లేదని తెలియడంతో కూల్ అయ్యారు. దత్తాత్రేయ కారు ప్రమాదానికి గురైన ప్రాంతానికి సమీపంలోనే కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాహనం ప్రమాదానికి గురైంది.