English | Telugu
అమెరికా ఖజానా డేటా హ్యాక్! రష్యా కుట్రపై అనుమానాలు
Updated : Dec 14, 2020
హ్యాకింగ్ కు గురైన విభాగాలను పరిశీలిస్తున్నామని, హ్యాకర్లు స్వాధీనం చేసుకున్న నెట్ వర్క్ ను తిరిగి సరిదిద్దేందుకు సీఐఎస్ఏ సాంకేతిక సహకారాన్ని అందిస్తోందని అమెరికా ఆర్థికశాఖ అధికారులు చెప్పారు. అయితే ఈ సైబర్ దాడి గత వారం జరిగిందని 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. కస్టమర్ల కంప్యూటర్ సిస్టమ్స్ ను పరిశీలిస్తుండే టూల్స్ ను హ్యాకర్లు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.
మరోవైపు అమెరికా ఖజానా విభాగంపై పై జరిగిన సైబర్ దాడి రష్యా ప్రభుత్వం అండతోనే జరిగిందని యూఎస్ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కు చెందిన ఓ గ్రూప్ ఈ పని చేసుటుందని భావిస్తున్న ఎఫ్బీఐ, సైబర్ దాడిపై విచారణ ప్రారంభించింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇదే టీమ్ పలు ప్రభుత్వ ఏజన్సీల వెబ్ సైట్లపై దాడి చేసి, విలువైన సమాచారాన్ని దొంగిలించిందన్న ఆరోపణలు ఉన్నాయి.