English | Telugu
బిఆర్ శెట్టి ఒప్పందాన్ని ఆవిరి చేసిన టీడీపీ సర్కార్
Updated : Apr 15, 2020
* ఒప్పందం సమయంలో భారీ మొత్తలు చేతులు మారాయని ఆరోపణలు
* సి బి ఐ ఆధ్వర్యం లో మొదలైన విచారణ
* 2018 లో బీ ఆర్ ఎస్ మెడిసిటీ పూర్తయ్యుంటే, ఈ రోజున రాజధాని ప్రాంతానికి ఈ కష్టం వచ్చి ఉండేది కాదు
తెలుగుదేశం ప్రభుత్వం తో ఒప్పందం ప్రకారం, ప్రస్తుత రాజధాని ప్రాంతం లో ప్రతిపాదించిన - 950 పడకల గల ఒక అత్యాధునిక ఆస్పత్రిని బి ఆర్ శెట్టి నిర్మించి సేవలు ప్రారంభించి ఉంటె, ఈ రోజు ఆంధ్ర ప్రాంతంలో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యుండేది కాదు. అవును, ఇది నిజం. 950 పడకల ఆస్పత్రి మాట దేవుడికెరుక. అది కనీసం వంద పడకల ఆసుపత్రిగా కూడా రూపుదిద్దు కాకపోవటం గమనార్హం.
రాజధాని ప్రాంతంలో కారుచౌకగా 100 ఎకరాలను బిఆర్ శెట్టి మెడిసిటీ సంస్థకు ఒక మెడికల్ యూనివర్సిటీ ప్రారంభించే ఒప్పందంతో తెలుగుదేశం ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ సంస్థ పట్ల ప్రత్యేక ప్రేమతో నిబంధనలను కూడా సడలించింది అయినప్పటికీ ఈ సంస్థ మెడికల్ యూనివర్సిటీ నిర్మాణ దిశగా గాని, 950 పడకల ఆధునిక ఆసుపత్రి నిర్మాణ దిశగా గాని ఎటువంటి చర్యలు తీసుకున్నట్లుగా మనకి కనిపించదు, ఇదే 100 ఎకరాలను నిజాయితీగల సంస్థలకు ఇచ్చి ఉన్నట్లయితే ఈ విపత్కర పరిస్థితులలో ఉన్నత స్థాయి ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే వాళ్ళు. అదేవిధంగా మెడికల్ సీట్లు కూడా రాష్ట్రానికి వచ్చి ఉండేవి.
తమ స్వార్థం కోసం వందల ఎకరాలను కాజేసే దుర్బుద్ధితో నే మెడిసిటీ పేరిట గత టిడిపి ప్రభుత్వం లోని పెద్దలు ఈ స్థలాలను దోచుకున్నారనే అంశం మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణ, సి బి ఐ విచారణ కూడా నడుస్తున్నాయి కూడా. అయితే, అదే ప్రాంతంలో ఎయిమ్స్ లాంటి సంస్థలచేత, లేదా టాటా గ్రూప్ చేత గానీ అత్యవసర ప్రాతిపదికన ఒక వంద పడకల ఆస్పత్రిని సిద్ధం చేయాలనీ విజిల్ బ్లోయర్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ , ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసారు.