English | Telugu
అస్సంలో కూడా మునిగిపోయి బోటు, అందరి ప్రాణాలు కాపాడామంటున్న అధికారులు.....
Updated : Oct 18, 2019
రోజు రోజుకు బోటు ప్రమాదాల సంఖ్య అధికమవుతోంది.గోదావరి బోటు ప్రమాదం జరిగి నెల రోజులు కావొస్తున్న ఇప్పటికి బోటు బయటకు రాలేదు. అచ్చం అలాంటి ఘటనే అస్సాంలో కూడా చోటు చేసుకుంది. అదృష్టవ శాతు ప్రమాదంలో మాత్రం ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. అధికారుల నిర్లక్షాలే ఇందుకు ముఖ్య కారణమా, లేక బోటు యజమాన్యమో తెలీదు కానీ ప్రజల ప్రాణాలతో మాత్రం చెలగాటమాడుతోంది ఈ సిబ్బంది.అస్సాంలో జరిగిన పడవ ప్రమాదంలో అందరినీ రక్షించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. సోనిత్ పూర్ జిల్లాలో జియో భరణి నదిలో ప్రమాదం జరిగింది. బిహా గావించి తేజ్ పూర్ లోని పంచ్ మహల్ ప్రాంతానికి వెళుతుండగా ఒక్క సారిగా పడవ బోల్తా పడినట్లుగా అధికారులు తెలిపారు. ప్రతి గురువారం ఏర్పాటు చేసి సంత కోసం స్థానికులుపంచ్ మహల్కు వెళ్తుంటారు. కూరగాయలు ఇంటికి అవసరమైన వస్తువుల కొనుక్కుందామని వెళతారు. అలా వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.
పడవ ప్రమాదం సమయంలో మోటర్ వాహనాలు కూడా అందులో ఉన్నాయి. పడవలో ఎక్కువ మంది ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో సుమారు డెబ్బై నుంచి ఎనభై మంది వరకు ఉన్నట్లుగా వదంతులొచ్చాయి. వీరిలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు క్షేమంగా వచ్చారు. పడవ ప్రమాదం సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ ప్రమాద సమయంలో పడవలో ఉన్నది యాభైమందేనని తేల్చారు. పడవ చిన్నదవడం అలాగే జనాలతో పాటు సరుకులు భారీగా ఉండటంతో ప్రమాదం జరిగింది. లోతు ఎక్కువ లేకపోడంతో చాలామందిని స్టేట్ రెస్క్యూ టీమ్స్ రక్షించగలిగాయి.