English | Telugu
ఎపిలో స్థానికసంస్థల ఎన్నికల నగారా మోగింది
Updated : Mar 6, 2020
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్నికల కమీషన్
మార్చి21- ఫేజ్ 1
మార్చి24 - ఫేజ్ 2
కౌంటింగ్-మార్చి 29
మున్సిపల్ఎలక్షన్స్
పోలింగ్ మార్చి 27
కౌంటింగ్-మార్చి 29
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 21న తొలి విడత ఎన్నికలు, మార్చి 24న రెండో విడత ఎన్నికల జరుగున్నాయి. మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 29న ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు విడుదల అవుతాయి.
ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. శుక్రవారం నాడు ఎన్నికల కమిషనర్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
బ్యాలెట్ పేపర్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ప్రతి బ్యాలెట్ పేపర్ కరెన్సీతో సమానమని ఎన్నికల కమిషనర్ చెప్పారు. మద్యం, డబ్బులు, బహుమతుల పంపిణీకి అడ్డుకట్ట వేయడంపై స్పెషల్ ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని సూచించారు.
మార్చి 7న తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కానుంది. ఈనెల 9 వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ జరుగనుంది. మార్చి 12వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 21న స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 29న కౌంటింగ్ జరుగనుంది.
10న రెండో విడత ఎన్నికల నోటిషికేషన్
మార్చి 10న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కానుంది. మార్చి 12 నుంచి 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మార్చి 15న నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 17న సాయంత్రం 3గంటలకు వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది.
13న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈనెల 13న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 15 నుంచి 17 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 18న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. మార్చి 20న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. మార్చి 27న పోలింగ్ జరుగనుంది. ఈ నెల 29న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.
మరో పక్క జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు కూడా ఖరారు అయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అందులో మహిళలకు పెద్దపీట వేశారు. ఎనిమిది జిల్లాల్లో మహిళలే జెడ్పీ చైర్ పర్సన్‌లు కాబోతున్నారు. మార్చి 21, 24న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఈనెల 27న మున్సిపల్ ఎన్నికలు వేర్వేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
జిల్లాల వారిగా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు
శ్రీకాకుళం- బీసీ (మహిళ), విజయనగరం- జనరల్, విశాఖ -ఎస్టీ (మహిళ), తూర్పుగోదావరి -ఎస్సీ (మహిళ), పశ్చిమగోదావరి -బీసీ జనరల్, కృష్ణా -జనరల్ (మహిళ), గుంటూరు -ఎస్సీ (మహిళ), ప్రకాశం -జనరల్ (మహిళ), నెల్లూరు -జనరల్ (మహిళ), చిత్తూరు -జనరల్, కడప -జనరల్, అనంతపురం -బీసీ (మహిళ), కర్నూలు-జనరల్.
స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో తలపడి అమీ తుమీ తేల్చుకోవడానికి అధికార ప్రతిపక్ష సభ్యులు సిద్ధమవుతున్నారు.