English | Telugu
ఆంధ్ర విద్యార్థులకు తెరాస కలర్ దుస్తులు!
Updated : Apr 27, 2020
ఏపీ స్టూడెంట్స్ కు వచ్చే ఏడాది నుంచి గులాబీ రంగు యూనిఫార్మ్
ఏపి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్స్ యూనిఫాం కలర్ మార్చాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో పలు విద్యా సంస్కరణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంతున్న ఏపీ ప్రభుత్వం, మరో కీలక అడుగు వేసింది. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే స్టూడెంట్స్ యూనిఫాం కలర్ మార్చనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి నుంచి 10 తరగతి విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చనున్నట్లు ఏపీ విద్యా శాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలుపు, నీలం, ముదురు నీలం రంగుల బట్టలు ఇస్తుండగా..వచ్చే ఏడాది నుంచి గులాబీ రంగు దుస్తులు ఇవ్వనున్నట్లు తెలిపింది. బాలురకు ప్యాంట్, షర్ట్… బాలికలకు పంజాబీ డ్రెస్ ఇస్తామని, బట్టలను ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని పేర్కొంది.