English | Telugu

ఏపీలో రెడ్ జోన్ లో 63 మండలాలు మాత్రమే: ముఖ్యమంత్రి 

లాక్ డౌన్ ప్రారంభమై నెల రోజులు దాటిందని, రాష్ట్రంలో టెస్టింగ్ సామర్జ్యం పెరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గతంలో వైరస్ వస్తే టెస్ట్ చేయడానికి సౌకర్యాలు కూడా లేవు, రాష్ట్రంలో 9 చోట్ల టెస్టింగ్ సెంటర్స్,ల్యాబ్స్ ఏర్పాటు చేసాం, 6500 టెస్ట్ లు చేసే స్థాయి కి ఎదిగాం అని సి ఎం చెప్పారు.

దేశంలోనే టెస్ట్ లు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 10లక్షల జనాభాకు 1300 టెస్ట్ లు చేస్తున్నామని, రాష్ట్రంలో ఇప్పటివరకు 74,511 టెస్ట్ లు చేశామని సి ఎం తెలిపారు. రాష్ట్రంలో 676 మండలాలు ఉంటే 63 మండలాలు రెడ్ జోన్స్ లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 80శాతం మండలాల్లో కరోనా కేస్ లు నమోదు కాలేదు అవి గ్రీన్ జోన్స్ లో ఉన్నాయని, రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో కోవిడ్ హాస్పటల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. క్వారయింటెన్ సెంటర్స్ లో అన్ని వసతులు కల్పిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.