English | Telugu
మే లోపు అయితేనే వైజాగ్ వస్తాం...ప్రభుత్వానికి చెప్పనున్న ఉద్యోగులు
Updated : Mar 18, 2020
ఏపీ కి 3 రాజధానులు ప్రకటన దగ్గరనించి వైజాగ్ కు సచివాలయ తరలింపు చర్చనీయాంశంగా మారింది...ఈలోపు అమరావతి లో ఆందోళనలు జరగడం స్థానిక ఎన్నికలు రావడం కూడా జరిగాయి...ఇప్పుడు స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడడం తో వైజాగ్ షిప్టింగ్ అంశం చర్చనీయాంశంగా అయ్యింది ..సచివాలయ ఉద్యోగులు వైజాగ్ వెళ్లడానికి ఇప్పటికే ప్రభుత్వం తో చర్చలు జరిపారు...మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు...తాజాగా సచివాలయంలో ఉద్యోగుల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగుతోంది..ఈ సమావేశం లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మే 31 లోపు సచివాలయం తరలించాలని ఉద్యోగులు కోరనున్నారు..ఆ తర్వాత కష్టం అనే అభిప్రాయం ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు...మే తర్వాత స్కూళ్లు. కాలేజీ లు తెరుస్తారు..దీని వల్ల మే లోపు వెళితే అడ్మిషన్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే అభిప్రాయం చెప్పనున్నారు...దీంతో పాటు ఉద్యోగులు వైజాగ్ వెళ్ళడానికి రెడీ గా ఉండాలనే విషయం కూడా చెప్పనున్నారు..మరి ప్రభుత్వం ఉద్యోగుల కు ఏమి చెప్తుంది అన్నది చూడాలి..