English | Telugu

ఖజానా ఖర్చుతో ప్రకటనల ఫోటోలు, సందేశాల బహిరంగ ప్రదర్శన పై నిషేధం

స్థానిక సంస్థలకు ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ప్రవర్తనా నియమావళి) అమలులో ఉన్న దృష్ట్యా ఖజానా ఖర్చుతో ప్రకటనలపై ఫోటోలు, సందేశాలను ప్రదర్శించడం, బహిరంగ ప్రదర్సనకు ఉంచడంపై నిషేధం విధించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ ప్రకటించారు. అదేవిధంగా ప్రస్తుతం జీవించి ఉన్న నాయకుల విగ్రహాలను కవర్ (ముసుగువెయ్యడం) చేయడం తప్పనిసరి అన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న వారికి చెందిన ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ల ద్వారా , ప్రభుత్వ భవనాలపై బహిరంగ ప్రదర్శన లు నిషేధం అమలు రావడం జరిగిందన్నారు. మార్చి 7వ తేదీ ఎమ్ సిసి అమల్లోకి వచ్చినందున ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల ను సజావుగా నిర్వహించడానికి , మోడల్ ప్రవర్తనా నియమావళి న్యాయమైన, సమతుల్యమైన, నిష్పాక్షికమైన రీతిలో అమలు చేస్తామన్నారు. ఎన్నికలను నిర్వహించే కాలంలో ప్రభుత్వ వ్యయంతో విగ్రహాలు, ఛాయాచిత్రాలు, సందేశాలను ప్రదర్శించడానికి వీలులేదన్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో లభించే మంత్రులు, రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని ఛాయా చిత్రాలను తొలగిస్తామనీ , వాటి విషయమే చర్యలు తీసుకుంటామని, ప్రక్షాళన లో భాగంగా వాటి తొలగింపునకు ఎన్నికల కమిషన్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని రాజకీయ నాయకుల ఛాయాచిత్రాలు రాష్ట్ర విభాగాల అధికారిక వెబ్‌సైట్ల నుండి తొలగించాలని స్పష్టం చేశామన్నారు.

అదేవిధంగా అన్ని హోర్డింగ్‌లు, ప్రకటనలు మొదలైనవి, ప్రభుత్వ నిధులతో, ఏదైనా జీవన రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీల విజయాలు సాధించటానికి అనుకూలంగా ప్రభావం చూపే వాటిని వెంటనే తొలగించాలన్నారు. ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ఇతర రాజకీయ కార్యకర్తల ఛాయాచిత్రాలను ప్రభుత్వ భవనాలు, ప్రాంగణాల్లో ప్రదర్శించడం పై నిషేధం ఉందన్నారు. ఈ సూచన జాతీయ నాయకులు, కవులు మరియు గతంలోని ప్రముఖ చారిత్రక వ్యక్తుల చిత్రాలకు లేదా భారత రాష్ట్రపతి మరియు గవర్నర్ల చిత్రాలకు వర్తించదని, వీటిని ప్రదర్శించబడటం కొనసాగించవచ్చు అని స్పష్టం చేశారు . రాజకీయాల్లో ఇప్పటికీ చురుకుగా ఉన్న రాజకీయ పార్టీల జీవన నాయకుల విగ్రహాలను ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లయితే వాటిని వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. , ప్రజా నిధులతో నిర్మించిన గత నాయకుల విగ్రహాలను కవర్ చేయవలసిన అవసరం లేదు. ఎన్నికల కోడ్ అమలు చేసిన తరువాత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఆధ్వర్యంలో ఉత్పత్తి చేయాల్సిన విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, మోడల్ ప్రవర్తనా నియమావళిలో రాజకీయ కార్యకర్తలు, పార్టీల ఛాయాచిత్రాలు లేదా సందేశాల చిహ్నాలు ఉండకూడదన్నారు. ఈ సూచనలు ఇప్పటి వరకు అమలు చేయనట్లయితే, వెంటనే అమలు చేయలని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ సూచనలను అతిక్రమించి , వాటి అమలులో లోపభూయిష్టంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని రమేష్ కుమార్ హెచ్చరించారు.