English | Telugu
పీఎం మోడీ నుండి సీఎం జగన్ వరకు.. అందరూ అదే బాపతు
Updated : Apr 28, 2020
మోడీ పేరు వింటే మనకి ముందుగా గుర్తొచ్చేది చాయ్ వాలా. ఓ చాయ్ అమ్మిన కుర్రాడు ప్రధాని స్థాయికి ఎదగడం గర్వకారణం. అయితే మోడీ సాధారణ స్థాయి నుండి వచ్చినా ఆయన జీవశైలి మాత్రం విలాసవంతంగా ఉంటుందని పలువురు విమర్శిస్తుంటారు. దానికి కారణం ఆయన ధరించే ఖరీదైన బట్టలు. మోడీ చాలా ఖరీదైన బట్టలు ధరిస్తాడని, అది కూడా ఒకసారి వేసిన డ్రెస్ మరోసారి వేయడని విపక్ష నేతలు ఆరోపిస్తుంటారు. ఓ సారి ఆయన సూట్ పై కాంట్రవర్సీ కూడా అయింది. మోడీ ధరించిన సూట్ పది లక్షలు అని, ఆయనకు సూట్ల మీదున్న శ్రద్ద సొసైటీ మీద లేదని, ఆ డబ్బుని పేదవారి కోసం ఖర్చు చేస్తే బాగుండేదని విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయినా మోడీ డ్రెస్సింగ్ స్టైల్ లో మాత్రం మార్పు రాలేదనే చెప్పాలి.
ఇక 2016 సమయంలో కర్ణాటకలో అయితే ఖరీదైన వాచ్ ల చుట్టూ రాజకీయం తిరిగింది. అప్పటి సీఎం సిద్దరామయ్య చేతి వాచ్ రూ.70 లక్షలు అని విపక్షాలు ఆరోపించాయి. అప్పట్లో ఇది బాగా కాంట్రవర్సీ అయింది. ఇక మాజీ సీఎం కుమారస్వామి వద్దనైతే చాలా ఖరీదైన వాచ్ లు ఉన్నాయని ప్రచారం జరిగింది. వజ్రాలు పొదిగిన 50 లక్షల నుంచి కోటి విలువైన వాచ్ లు ఉన్నాయని వార్తలొచ్చాయి. అదేవిధంగా, సిద్దరామయ్య ఖరీదైన పెన్ను గురించి కూడా అప్పట్లో బాగా కాంట్రవర్సీ అయింది.
ఇలా లక్షల విలువైన వస్తువులు వాడుతూ చాలా మంది నాయకులు విమర్శలు ఎదుర్కొన్నారు. వారిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఉన్నారు. ఆయన కాస్ట్ లీ వాచ్ కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. జగన్ చేతికున్న వాచ్ ఖరీదు రూ.13 లక్షల 31 వేలు. కాస్ట్ లీ సీఎం అంటూ ఇప్పటికీ ఆయనపై పలువురు ట్రోల్ల్స్ చేస్తుంటారు. అంతేకాదు, జగన్ ధరించే చొక్కాలపై కూడా కాంట్రవర్సీ జరిగింది. ఆయన ధరించే చొక్కా ధర చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ క్లాత్ ని ప్రత్యేకంగా తెప్పిస్తారని అంటుంటారు. మొత్తానికి పీఎం మోడీ నుండి సీఎం జగన్ వరకు పలువురు నాయకులు ఆడంబరాలకు పోయి విమర్శలు ఎదుర్కొన్నారు.