English | Telugu

నిమ్మగడ్డ తొలగింపుపై కొనసాగుతున్న తుది వాదనలు

ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నిమ్మగడ్డ తరఫున న్యాయవాది ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం వివరణ, నిమ్మగడ్డ పిటిషన్లపై విచారణ సాగుతోంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ దాఖలు చేసిన రిట్‌పై రాతపూర్వక వాదనలను న్యాయవాది కోర్టుకు సమర్పించారు.

స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత రహస్యమైనదని, న్యాయ సలహా మేరకే తాను నడచుకున్నానని రమేశ్‌కుమార్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో కమిషనర్‌కు విచక్షణాధికారం ఉంటుందని, దాని మేరకే తాను వ్యవహరించానని పేర్కొన్నారు. వాయిదా నిర్ణయంపై ప్రభుత్వాధికారులనో, ఎన్నికల సంఘ కార్యదర్శినో సంప్రదించాల్సిన అవసరం లేదని, ఆ మేరకు నిబంధనలేవీ లేవన్నారు.