English | Telugu

టీడీపీ నేతలకు షాక్ తప్పదా... 106మంది పేర్లతో ఐటీకి లేఖ రాసిన సీఐడీ!

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఇచ్చింది సీఐడీ. రాజధాని పరిధిలోని అసైన్డ్ భూముల కొనుగోళ్ల కేసులో విచారణ జరపాలని ఐటీ డిపార్ట్ మెంట్ కు లేఖ రాసింది ఏపీ సీఐడీ. ఇప్పటికే తెల్లరేషన్ కార్డుల భూముల కొనుగోళ్లలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దృష్టికి తీసుకెళ్లింది సిఐడి. దీనిపై విచారణకు ఈడీ కూడా అంగీకరించింది. తాజాగా ఐటీ వింగ్ కూడా ఫోకస్ పెట్టాలన్న సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ లేఖతో పాటు 106 మంది కొనుగోలు దారుల పేర్లను జత చేశారు. వాళ్ల పేర్లు అడ్రస్ వివరాలను అందించారు. అంతేకాదు 2018, 2019 వరకు రెండు లక్షలకు మించి జరిగిన ట్రాన్సాక్షన్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని అడిగారు. 2018,19 వరకు కొనుగోలు చేసిన దాని మీద కూడా విచారణ చేయాలంటూ ఈ లేఖలో పేర్కొనటం జరిగింది.

అయితే రాజధాని ప్రాంతం గ్రామాలకు సంబంధించిన అసైన్డ్ భూములకు సంబంధించి భారీగా భూమి కొనుగోలు విక్రయాలు జరిగినాయి కాబట్టి, రూ. 2లక్షలకు మించి జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేయాలని కూడా ఆ లేఖలో సునీల్ కుమార్ పేర్కొన్నారు. అయితే చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూములు అమ్మకాలు, కొనుగోలు చేసినట్టుగా సీఐడీ అధికారులు ఆ లేఖలో క్లియర్ గా రాయటం జరిగింది. ఈ లేఖతో పాటు ఒక ఎక్సెల్ షీట్ లో మొత్తం 106 మందికి సంబంధించిన అసైన్డ్ భూముల కొనుగోళ్లల్లో ఉన్న వారి పూర్తి వివరాలు.. వారి అడ్రస్ లు సర్వే నంబర్ తో సహా మొత్తం ఐటీ అధికారులకి సమర్పించడం జరిగింది.