English | Telugu

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, గుట్కాలు లాంటివి నమిలి ఉయ్యడం ఏపి ప్రభుత్వం నిషేదించింది. అలా చేసిన వారిపై సిఆర్పిసి కింద కేసులు నమోదు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, గుట్కాలు లాంటివి నమిలి ఉయ్యడం.. లాంటివి చేయడం వల్ల కోవిడ్ వ్యాపించే అవకాశం ఉందని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కేంద్రం సూచనల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం ఏపి ప్రభుత్వం నిషేదించింది.