English | Telugu
షబే బారత్ జాగారం! ఇంట్లోనే జరుపుకోండి! మసీదులకు వెళ్ళొద్దు!
Updated : Apr 8, 2020
ముస్లింలందరూ గురువారం రాత్రి సామాజిక బాధ్యతతో వ్యవహరించి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ సీఈఓ అలీం బాషా మసీదు కమిటీలకు ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9 గురువారంనాడు జరిగే షబ్ ఎ బరాత్ పెద్దల పండగ జరుపుకోవడంలో ముస్లింలందరూ లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. ఫాతేహా మొదలైన మతపరమైన ఆచారాలు ఇళ్లనుంచే నిర్వహించాలి. ముస్లిం స్మశానవాటికలో సమూహముగా ఫాతేహా మొదలైనవాటిని నిర్వహించరాదని వక్ఫ్‌బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ శాశ్వతంగా ప్రపంచం నుండి తొలగిపోయి ప్రజలందరికీ విముక్తి కలగాలని పవిత్ర షబే బారత్ సందర్భంగా అల్లాహ్ ను దువా చేసి వేడుకోవాలని ఎం.బి.టి. నేత అంజదుల్లాఖాన్ హైదరాబాద్‌లో పిలుపునిచ్చారు.
ఈ మహోన్నతమైన, ప్రాముఖ్యత కలిగిన షబే బరాత్ పండుగను పురస్కరించుకొని తమ పూర్వీకులు చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పేద వాళ్లకు అన్నదానం చేయమని ఎం.ఐ.ఎం.పార్టీ ముస్లింలకు సూచించింది.
ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లోనే ప్రత్యేక ప్రార్థనలు విడివిడిగానే జరుపుకోవాలని మతపెద్దలు సూచించారు.