English | Telugu

సీఎం జగన్ లేఖపై విచారణ జరపాలి: అఖిల భారత న్యాయవాదుల సంఘం

న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన సీఎం జగన్ పై సత్వరం విచారణ చేయించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అఖిల భారత న్యాయవాదుల సంఘం ప్రతినిధులు లేఖ రాశారు. సీఎం జగన్ లేఖలో న్యాయమూర్తులపై ఉపయోగించిన పదజాలం అభ్యంతరకరంగా ఉందన్నారు. వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని న్యాయమూర్తులను తూలనాడుతున్నారని న్యాయవాదుల సంఘం ప్రతినిధులు మండిపడ్డారు.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు న్యాయవ్యవస్థను,..న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థను దూషించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ రాసిన లేఖపై సత్వరం విచారణ చేయించాలన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. న్యాయవ్యవస్థ స్వతంత్రను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అఖిల భారత న్యాయవాదుల సంఘం తన
లేఖలో వెల్లడించింది.