English | Telugu
సమతా కేసు తుది తీర్పు నేడే...
Updated : Jan 30, 2020
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ అత్యాచారానికి బలైన సమత కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమత హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడాలని నిర్మల్ జిల్లా గోసాన్ పల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బెల్లూన్లు అమ్ముకుని జీవించే మహిళ పట్ల అత్యంత పాశవికంగా దుండగులు దారుణానికి పాల్పడటం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. హంతకులను కఠినం గా శిక్షించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఆందోళనలు సాగాయి. ప్రజల ఆందోళన నేపథ్యం లో ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ కూడా వేగవంతంగా పూర్తి చేసింది.
ఘటన చోటుచేసుకున్న నాటి నుంచి ఆ ప్రాంతీయులు ధర్నాలకు దీక్షలు పాల్పడ్డారని ఇప్పుడు సరైన తీర్పు వెలువడి సమతకు న్యాయం జరగని పక్షంలో తమ ఆడబిడ్డ కోసం ఎలాంటి చర్యలకైనా పాల్పడ్డానికి సిద్ధమని,పట్టణంలో ఉన్న వారికి ఒక న్యాయం తమకో న్యాయంగా కాకుండా తమ దలిత వర్గాలకు కూడా సరైన జరిగేలా చూడాలని గ్రామస్తులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. నేడు వెలువడనున్న తీర్పుతో సమతకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి.