English | Telugu
మరో పది మెట్రో స్టేషన్ లకి మరమ్మత్తులు
Updated : Oct 2, 2019
హైదరాబాద్ లోని వివిధ మెట్రో స్టేషన్ లో లోటుపాట్లపై అధికారులు స్పందించారు. అమీర్ పేటలో పెచ్చులు ఊడిపడి ఒక యువతి మరణంచిన సంఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. తర్వాత కొన్ని స్టేషన్ లలో ఉన్న లోపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భద్రతాపరమైన అంశాలను సీఎం ఆర్ఎస్ ప్రత్యక్షంగా పరిశీలించారు. మిగతా స్టేషన్ ల పై సమీక్షలు జరిపారు. దీనితో ఎక్కడెక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో అధికారులు గుర్తించారు. ఇందు కోసం ఆరు ఎల్ఎన్టి ఇంజనీరింగ్ టీమ్ లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు పది స్టేషన్ లలో లోపాలను గుర్తించి వాటిని సవరించారు. ఇటు ప్రభుత్వం అటు సీఎం ఆర్ఎస్ ఆదేశాలతో అన్ని స్టేషన్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా అర్ధరాత్రి తర్వాత ఫ్లడ్ లైట్ల వెలుతురులో బూమ్ లిప్స్ ఉపయోగించి మరమ్మతులు చేస్తున్నట్లుగా ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రతీ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి చిన్న చిన్న విషయాల్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లుగా వివరించారు. అనుభవజ్ఞులైన ఇంజినీరింగ్ బృందాలు భద్రతే ప్రధానంగా ఎక్కడా రాజీపడకుండా పరిశీలించి లోపాలు సవరిస్తున్నట్లుగా చెప్పారు. అమీర్ పేటలో ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా మెట్రో అధికారులు, ఎల్ఎన్టి అధికారాలు కూడా స్పందించి తక్షణమే చర్యలు కూడా చేపట్టారు. దీనికి సంబంధించి దాదాపు డెబ్బై రెండు కిలో మీటర్ల ఉన్నటువంటి అరవై నాలుగు మెట్రో స్టేషన్స్ లో దాదాపు నలభై ఎనిమిది వాడకంలో ఉండగా, వాటిలో పది స్టేషన్స్ లో కూడా ఈ లోపాలను గుర్తించారు అధికారులు. ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉన్నాయో, సీలింగ్ కి సంబంధించి,పెచ్చులు ఊడిపోయినటువంటి వాటికి సంబంధించి మొత్తం కూడా సర్వేకు సంబంధించి ఇలాంటి లోపాలన్నిటిని కూడా గుర్తించారు. దాదాపు అన్ని వీలైనంత త్వరలో అన్నింటిని సవరించే పనిలో పడ్డారు అధికారులు. బాలానగర్ మెట్రో స్టేషన్, పరేడ్ గ్రౌండ్సు, రసూల్ పురా మెట్రో స్టేషన్, హైటెక్ సిటీ, గంధీభవన్, ఎల్బీనగర్, న్యూ మార్కెట్ ఇలా దాదాపు పది స్టేషన్స్ లో మాత్రం మరమత్తులు పూర్తి చేశారు అధికారులు.ఇంకా ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగక మందే అధికారులు వీలైనంత త్వరలో పరశ్కరించాలని ప్రజలు కొరుతున్నారు.