English | Telugu

భారత్- చైనా సరిహద్దు ఘర్షణలో భారీ ప్రాణ నష్టం

భారత్- చైనా సరిహద్దులో ఘర్షణ ఆందోళన కలిగిస్తోంది. గాల్వన్‌ లోయలో చైనా సైనికులు, భారత్ సైనికులపై రాళ్లు విసిరి దాడికి దిగారు. దీంతో, మన సైనికులు వారికి దీటుగా బదులిచ్చారు. అయితే, ఈ హింసాత్మక ఘర్షణలో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘర్షణలో 20 మంది భారత్ జవాన్లు మరణించారని సమాచారం. చైనా సైనికులు కూడా భారీ సంఖ్యలో మరణించినట్లు తెలుస్తోంది. 43 మంది చైనా సైనికులు మరణించారని సమాచారం.

సరిహద్దులో చైనాతో తలెత్తిన ఘర్షణపై భారత ప్రభుత్వం స్పందించింది. తామెప్పుడూ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ని అతిక్రమించలేదని, తమ కార్యకలాపాలు ఎప్పుడూ దాని పరిధిలోనే జరిగాయని స్పష్టం చేసింది. ఎల్‌ఏసీ ని గౌరవిస్తూ చైనా బలగాలు సాఫీగా వెనక్కు వెళ్తాయని భావించినట్లు తెలిపింది.

మరోవైపు ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. తదుపరి కార్యాచరణ పై సమాలోచనలు జరుపుతున్నారు.