భారత్ లో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్నటివరకు రోజుకి రెండు మూడోందలు నమోదైన కరోనా మరణాలు.. ఇప్పుడు ఏకంగా ఒక్కరోజులో రెండు వేలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 10,974 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 2,003 మంది కరోనాతో మరణించారు. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,54,065కు చేరగా, మృతుల సంఖ్య 11,903కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,55,227 యాక్టివ్ కేసులున్నాయి.