English | Telugu
కాంగ్రెస్ కు పెద్ద ఝలక్.. రేపు బీజేపీ గూటికి రాములమ్మ..!
Updated : Nov 23, 2020
గత కొంత కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న రాములమ్మ, కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. అదే సమయంలో ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆపై తన అనుచరులతో సమావేశమైన విజయశాంతి, బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొంత కాలం నుండి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పై అసంతృప్తిగా ఉన్న విజయశాంతిని బుజ్జగించడానికి కాంగ్రెసు తెలంగాణ ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది.