English | Telugu
కంటే కూతుర్నే కనాలి... కానీ కీర్తిలాంటి కూతురు వద్దే వద్దు...
Updated : Nov 1, 2019
కంటే కూతురినే కనాలంటారు... ఎందుకంటే వృద్ధాప్యంలో కొడుకు కంటే కూతురే ఆదరిస్తుందని, బాగా చూసుకుంటుందని... అమ్మలాగా మారి ఒక ముద్ద అన్నం పెడుతుందని, లాలిస్తుందని, తోడూనీడగా ఉంటుందని, భూదేవంతా ఓపికతో కష్టాన్ని భరిస్తుందని, కంటికి రెప్పలా చూసుకుంటుందని ఆ మాటన్నారు. అయితే ఇది నిజమే. ఊరికే ఆ మాట అనలేదు. తల్లిదండ్రులపట్ల కూతురు చూపించే ప్రేమ అప్యాయతలకు హద్దులే ఉండవు. అందుకే కంటే కూతురినే కనాలన్నారు. కానీ కీర్తి లాంటి కూతురు మాత్రం ఏ తల్లిదండ్రులకూ ఉండకూడదంటున్నారు పోలీసులు. ఎందుకంటే కూతురనే మాటకే ఈ కీర్తి... అపకీర్తి తెచ్చిందని, తన కామవాంఛలు తీర్చుకోవడానికి కన్నతల్లినే కడతేర్చిన కిరాతకురాలంటూ మండిపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హయత్ నగర్ రజిత మర్డర్ కేసులో కూతురు కీర్తిరెడ్డితోపాటు ఆమె ప్రియుడు శశికుమార్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పక్కా ప్లాన్ తోనే కీర్తి, శశి కలిసి... రజితను గొంతునులిమి చంపేశారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గతంలోనూ ఒకసారి నిద్రమాత్రలిచ్చి తల్లి రజితను చంపేందుకు కీర్తి ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. మైనర్ గా ఉన్నప్పుడే బాయ్ ఫ్రెండ్ బాల్ రెడ్డి అత్యాచారం చేయడం... కీర్తి గర్భం దాల్చిందని, అయితే అబార్షన్ చేయించుకోవడానికి సాయంచేసిన శశి... ఆ తర్వాత కీర్తిని లొంగదీసుకున్నాడని సీసీ వివరించారు. కీర్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకున్న శశి.. వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడని, దాంతో శశి చెప్పినట్లు కీర్తి నడుచుకునేదని, అలా శశికి భయపడే తల్లి రజితను హత్య చేసిందన్నారు మహేశ్ భగవత్.
దృశ్యం సినిమాను తలపించేలా రజిత మర్డర్ జరిగిందన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. ఇద్దరూ కలిసి రజితను చంపేసి... మృతదేహాన్ని రామన్నపేట దగ్గర రైల్వేట్రాక్‌పై పడేశారని కేసు డిటైల్స్ వెల్లడించారు. కీర్తి ఆస్తిపై కన్నేసిన శశినే ఈ మర్డర్ కథ నడిపించాడని తెలిపారు. అయితే, రజిత హత్య తర్వాత తప్పించుకునేందుకు కీర్తిరెడ్డి ప్రయత్నించిందని సీపీ వెల్లడించారు. తన తల్లిలాగా గొంతు మార్చి.. బాల్‌రెడ్డికి ఫోన్ చేసిన కీర్తిరెడ్డి... తాను వైజాగ్ వెళ్తున్నట్లు నమ్మించిందని తెలిపారు. ఇక, ఇలాంటి ఘటనే గుంటూరులో జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చింది కూతురు. భర్త, భాయ్ ఫ్రెండ్ తో కలిసి... కన్నతల్లినే చంపేసింది. దాంతో, నిందితురాలు భార్గవితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు పోలీసులు.