English | Telugu
కజిరంగా పార్క్‌లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి!
Updated : May 11, 2020
ఈ ఏడాది కజిరంగా జాతీయ వనంలో ఒక పులి మరణించింది. మళ్లీ రెండో పులి మరణించింది. ఈ పులి కళేబరం వద్ద ఏకే 47 రైఫిల్ తూటాలు లభించాయి. దీంతో వేటగాళ్లు ఈ పులిని చంపి ఉంటారని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ జాతీయ వనంలో 121 రాయల్ బెంగాల్ పులులున్నాయి. వీటితోపాటు కొమ్ములున్న ఖడ్గమృగాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో పులులు, ఖడ్గమృగాలకు మధ్య దాడులు కొనసాగుతుంటాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కజిరంగా జాతీయ వనంలో సందర్శకులను నిలిపివేశారు.