దేశవ్యాప్తంగా కోవిద్ 19వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదకొండు లక్షలకు చేరువలో ఉంది. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో బీహార్ రెండోస్థానంలో ఉన్నాయి. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలపై శాస్త్రవేత్తల బృందం అధ్యాయనం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మౌలిక వసతులు, వైద్యసదుపాయాలు, పరిశుభ్రత పారిశుద్ధ్యం తదితర 15 అంశాల ఆధారంగా వైరస్ ముప్పు ఏ విధంగా ఉండబోతుంది అన్నది గమనిస్తూ ఒక నివేదికను రూపొందించారు. ఈ వివరాలన్నీ ది లాస్సె ట్ పత్రికలో ప్రచురించారు.
జార్ఖండ్, మహరాష్ట్ర ,ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనూ కరోనా తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తల విశ్లేషణలో తెలిసింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ పరిశోధన వివరాలను పంపించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి తాము జరిపిన పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.