English | Telugu
ఆర్టీసి కార్మిక సంఘాలకు అర్ధరాత్రి వరకు డెడ్ లైన్... వాట్ నెక్స్ట్?
Updated : Nov 5, 2019
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఈ రోజు సాయంత్రంతో ముగియబోతోంది. మరోవైపు కార్మిక సంఘాలు చర్చలకు పిలిస్తే సమ్మె విరమించటానికి సిద్ధంగా ఉన్నాము కానీ, బేషరుతగా ఉద్యోగాలలో చేరేది లేదని చెబుతున్నారు. ఖచ్చితంగా అందరూ సమ్మె వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు, అటు హైకోర్ట్ చెప్పినప్పటికీ ప్రభుత్వం చర్చలకు పిలుస్తున్నప్పటికీ కూడా చర్చల్లో జరగాల్సిన న్యాయం జరగడం లేదు అన్నదే మొదట్నుంచీ జెఏసి చెప్పుకొస్తున్న మాట.
అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు డెడ్ లైన్ విధించారు, ఈ సారి మాత్రం ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ లోపు ఖచ్చితంగా కార్మికులు ఉద్యోగాల్లో చేరాలి లేకపోతే బేషరుతుగా ఉద్యోగాల్లోంచి తొలగించబడతారని ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో దీనిని కార్మికులు ఎలా తీసుకుంటారనే దానిపైన కూడా ఒకింత ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే మానవహారాలతో ప్రతి జంక్షన్ వద్ద నిరసన తెలియజేయడానికి కార్యాచరణ రూపుదాల్చనున్న నేపథ్యంలో ఈ సారి ఎలాంటి కార్యాచరణ ముందుకెళ్తుంది, ఈ రోజు అర్ధరాత్రి లోపు చేరకపోతే ఖచ్చితంగా ఆర్టీసీలో ఉండరు అని చెప్తున్న నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కూడా దానికి తగ్గ కార్యాచరణను రూపొందించుకుందనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు అఖిల పక్ష సమావేశంతో పాటు ట్రేడ్ యూనియన్లు అందరూ కూడా కలిసి సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై చర్చించబోతున్నారు.