English | Telugu
చింతమనేని అరెస్ట్.. కరోనాని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న జగన్
Updated : Jun 13, 2020
చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ను టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ఆఖరికి కరోనా ని కూడా వైఎస్ జగన్ వేధింపుల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.
"టిడిపి నాయకుడు చింతమనేని అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. కోవిడ్ నిబంధనలు ఒక్క టిడిపి నాయకులకేనా. చింతమనేని ఎక్కడా గుంపులుగా తిరగలేదు, వెంట అనుచరులు లేరు. ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు." అని లోకేష్ పేర్కొన్నారు.
"ఆఖరికి కరోనా ని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న వైఎస్ జగన్ గారి మానసిక స్థితిని చూసి జాలేస్తుంది. వైకాపా నాయకులు కోవిడియట్స్ గా మారారు అని జాతీయ మీడియా సైతం ఉతికి ఆరేసింది. గుంపులుగా తిరిగి,ర్యాలీలు నిర్వహించి కరోనా వ్యాప్తి కి కారణమైన వైకాపా నేతల పై కేసులు ఉండవా?" అంటూ లోకేష్ జగన్ సర్కార్ ని నిలదీశారు.