English | Telugu
అమెరికాలో మరో ఘోరం.. మళ్ళీ అట్టుడుకుతోంది
Updated : Jun 15, 2020
ఇది ఇలా ఉండగా వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌లో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. నగరంలో కొంత ప్రాంతాన్ని వారు అక్రమించుకుని దానికి "క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్" అని పేరు పెట్టి దానిని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. నగరంలోకి రాకపోకలు జరగకుండా రహదారుల్ని నిర్బంధించారు. సియాటెల్ కు చెందిన పోలీసు శాఖను పూర్తిగా రద్దు చేయాలని, సాయుధ దళాల్ని నిషేధించాలని నిరసనకారులు డిమాండ్ చేసారు. ఐతే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెక్రోసాఫ్ట్, బోయింగ్, వాల్‌మార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థల కార్యాలయాలన్నీ సియాటెల్‌లోనే ఉండటంతో ఈ ఘటన అమెరికాకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సియాటెల్ నగరాన్ని అదుపులోకి తీసుకోవాలని పదే పదే చెబుతున్నా.. ఆందోళనకారులకు సానుభూతి తెలుపుతున్న మేయర్, గవర్నర్‌లు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటె.. బానిసత్వాన్ని ప్రోత్సహించిన జాన్ మెక్‌డొనో విగ్రహాన్ని న్యూ ఓర్లాన్స్‌లోని నిరసనకారులు ధ్వంసం సమీపంలోని మిస్సిసిపీ నదిలో కలిపేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.