English | Telugu
ఏపీ మంత్రి సొంత ఊళ్ళో పేకాట క్లబ్ పై పోలీసుల దాడి.. మంత్రి సోదరుడి పై కేసు
Updated : Aug 28, 2020
అయితే పోలీసుల పై గుండాలు దాడి చేసిన సమాచారంతో అక్కడికి మరి కొన్ని పొలిసు బలగాలు చేరుకుని లాఠీ ఛార్జ్ చేయడంతో గుండాలు పరారయ్యారు. అయితే పేకాట నిర్వహిస్తున్న షెడ్ దగ్గరలో పేకాటరాయుళ్లు మధ్యలో వదిలేసిన రూ.5.34 లక్షలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ పేకాట షెడ్ లో ఏపీలో నిషేధించిన ఖరీదైన లిక్కర్ బ్రాండ్లన్నీ దొరికాయి. ఈ లిక్కర్ ను ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక లోని బళ్లారి నుండి లారీలలో తెస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తున్న మంత్రి జయరాం కు సోదరుడు నారాయణ పై.. అలాగే మంత్రి అనుచరులు శ్రీధర్, జగన్ లపై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దాడికి పాల్పడ్డ ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారని ఏఎస్పీ గౌతమి తెలిపారు.